డీసీపీ ఇందిరా చేతులమీదుగా అంబేద్కర్ జయంతి వేడుకలు.
_మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్‌లో ఘనంగా నిర్వహణ
Views: 20
On
నేరడ్‌మెట్, ఏప్రిల్ 14 (తెలంగాణ ముచ్చట్లు):
మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అడ్మిన్ డీసీపీ ఇందిరా ముఖ్య అతిథిగా హాజరై అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, దేశానికి అంబేద్కర్ అందించిన సేవలు అమూల్యమని పేర్కొన్నారు. సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన కృషి ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని అన్నారు. రాజ్యాంగ విలువలను పాటిస్తూ సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని అంబేద్కర్‌కు ఘన నివాళులు అర్పించారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments