గొర్రెల కాపరుల సంక్షేమానికి చర్యలు తీసుకోవాలి .

నాగేంద్ర యాదవ్.

గొర్రెల కాపరుల సంక్షేమానికి చర్యలు తీసుకోవాలి .

మహబూబ్‌నగర్ ,ఏప్రిల్13(తెలంగాణ ముచ్చట్లు):

రాష్ట్ర గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్ పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో నాయకులు ప్రభుత్వాన్ని గొర్రెల కాపరుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా బీపీ మండల్ వర్ధంతిని పురస్కరించుకుని జెండా ఆవిష్కరణ చేసి, ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.నాయకులు మాట్లాడుతూ గొర్రెలకు బీమా సదుపాయం కల్పించడం, ఎన్‌సీడీసీ రుణాలను మాఫీ చేయడం, రెండో విడత గొర్రెల పంపిణీ పథకాన్ని అమలు చేయడం వంటి డిమాండ్లను ముందుకు తెచ్చారు. ప్రతి మండలంలో గొర్రెల–మేకల మార్కెట్ యార్డులు ఏర్పాటు చేయడం, పశువైద్య సబ్ సెంటర్లను బలోపేతం చేసి సిబ్బందిని నియమించడం అవసరమని పేర్కొన్నారు.భూమిలేని గొర్రెల కాపరులకు రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, 50 సంవత్సరాలు దాటిన వారికి పింఛన్ కల్పించాలని, పట్టణ ప్రాంతాల్లో 50% సబ్సిడీపై పశువులను అందించాలని, ఎన్‌ఎల్‌ఎం పథకంలో మార్పులు చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు పోచబోయిన శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారం తిరుపతయ్య యాదవ్, జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట నరసింహ యాదవ్, నాగేంద్ర యాదవ్  తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .