పెద్దమందడి మండల కేంద్రంలో తాగునీటి సమస్య.. పట్టించుకోని అధికారులు .

బీఆర్ఎస్ మండల అధికార ప్రతినిధి కురుమూర్తి ఆవేదన.

పెద్దమందడి మండల కేంద్రంలో తాగునీటి సమస్య.. పట్టించుకోని అధికారులు .

పెద్దమందడి,మే30(తెలంగాణ ముచ్చట్లు): 

వనపర్తి జిల్లా పెద్దమందడి మండల కేంద్రంలో గత నాలుగు రోజులుగా తాగునీటి సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీఆర్ఎస్ మండల అధికార ప్రతినిధి కురుమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. మండుతున్న ఎండల మధ్య కనీసం తాగడానికి కూడా నీరు అందక మహిళలు, వృద్ధులు ఖాళీ బిందెలతో నీటి కోసం తిరగాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు.మండల కేంద్రానికి సరఫరా అయ్యే మిషన్ భగీరథ పైపులైన్లలో సాంకేతిక లోపాలు లేదా లీకేజీల కారణంగా నీటి సరఫరా నిలిచిపోయినట్లు తెలుస్తోందని కురుమూర్తి తెలిపారు. ఇప్పటికే గ్రామంలోని బావులు, బోర్లు ఎండిపోవడంతో ప్రజలకు ప్రత్యామ్నాయ నీటి వనరులు కూడా అందుబాటులో లేకుండా పోయాయని చెప్పారు. దీంతో ప్రజలు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు నీటి ట్యాంకర్లను ఆశ్రయించి అదనపు భారం మోస్తున్నారని పేర్కొన్నారు.గ్రామంలో నాలుగు రోజులుగా ఇంతటి తీవ్రమైన తాగునీటి సమస్య కొనసాగుతున్నప్పటికీ సంబంధిత గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులు, స్థానిక గ్రామ పంచాయతీ అధికారులు స్పందించడం లేదని కురుమూర్తి విమర్శించారు. సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా, త్వరలోనే మరమ్మతులు చేపడతామని చెబుతూ కాలయాపన చేస్తున్నారే తప్ప ప్రజలకు ఉపశమనం కలిగించే చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.కనీసం తాత్కాలిక చర్యగా నీటి ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేయాల్సి ఉన్నప్పటికీ ఆ దిశగా కూడా ఎలాంటి చర్యలు కనిపించడం లేదని ఆయన అన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వెంటనే సమస్యను పరిష్కరించి, మిషన్ భగీరథ నీటి సరఫరాను పునరుద్ధరించడంతో పాటు తాత్కాలికంగా నీటి ట్యాంకర్ల ద్వారా తాగునీటిని అందించాలని బీఆర్ఎస్ మండల అధికార ప్రతినిధి కురుమూర్తి అధికారులను డిమాండ్ చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఆర్డినెన్స్‌తో టెట్ మినహాయింపు కల్పించాలి. వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఆర్డినెన్స్‌తో టెట్ మినహాయింపు కల్పించాలి.
వనపర్తి,మే30(తెలంగాణ ముచ్చట్లు): ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) సమీక్షా పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారని, వారికి ఉపశమనం కల్పించేందుకు...
ఏసీబీ ట్రాప్ కేసులో నేలకొండపల్లి పూర్వ తహసిల్దారు  నరసింహారావుకు జైలు శిక్ష.
కోర్టు వాయిదాలకు గైర్హాజరు.. నలుగురిని హుజూరాబాద్ జైలుకు తరలింపు.
యుద్ధప్రాతిపదికన గట్ల నర్సింగాపూర్ బ్రిడ్జి నిర్మించాలి!
చిట్టీ డబ్బుల వివాదం.. యువకుడి ఆత్మహత్యాయత్నం.
మహిళల ఆర్థికాభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తాం: చైర్మన్ దిలీప్.
పెద్దమందడి మండల కేంద్రంలో తాగునీటి సమస్య.. పట్టించుకోని అధికారులు .