కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త మృతి.. పార్టీకి తీరని లోటు.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త మృతి.. పార్టీకి తీరని లోటు.

పెద్దమందడి,మే30(తెలంగాణ ముచ్చట్లు): 

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త పానుగంటి సామేలు తన స్వంత వ్యవసాయ పొలంలో పనిచేస్తుండగా అకస్మాత్తుగా అస్వస్థతకు గురై మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.ఈ విషయాన్ని స్థానిక నాయకుల ద్వారా తెలుసుకున్న వనపర్తి ఎమ్మెల్యే  తూడి మేఘారెడ్డి బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ.. కాంగ్రెస్ నాయకుల ద్వారా బాధిత కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయంగా రూ.5,000/-రూపాయలను అందజేశారు.ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, పానుగంటి సామేలు పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేసిన నిబద్ధత కలిగిన కార్యకర్త అని, ఆయన మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. ఆయన సేవలను పార్టీ ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో పెద్దమందడి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొమ్ము వెంకటస్వామి, గ్రామ సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం, వార్డు సభ్యులు రాములమ్మ, హనుమంతు, కావాలి కృష్ణ, నరేష్, మాజీ సర్పంచ్ సిద్ధయ్య, తిక్కన్న, రఘుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .