ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన వారధి ఫౌండేషన్ చైర్మన్ చింతనిప్పు కృష్ణ చైతన్య.

ఖమ్మం బ్యూరో ,మే 28(తెలంగాణ ముచ్చట్లు )

ఉమ్మడి రాష్ట్ర పూర్వ ముఖ్యమంత్రి , తెలుగువారి ఆత్మగౌరవాన్ని దశ దిశలా చాటి చెప్పిన దివంగత నందమూరి తారక రామారావు జయంతి పురస్కరించుకొని గురువారం వారధి ఫౌండేషన్ చైర్మన్ చింతనిప్పు కృష్ణ చైతన్య ఘనంగా నివాళులర్పించారు. స్థానిక ఎన్టీఆర్ సర్కిల్ లోని నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చింత నిప్పు కృష్ణ చైతన్య మాట్లాడుతూ తెలుగుజాతి గౌరవాన్ని దేశ విదేశాలలో ఇనుమడింపజేసి తెలుగు భాషకు కీర్తి ప్రతిష్టలు తీసుకుని వచ్చిన అన్న ఎన్టీఆర్ జీవితం ప్రతి ఒక్కరికి మార్గదర్శకం అని తెలిపారు. ఎన్టీఆర్ చూపిన మార్గంలో తెలుగువారి ప్రతిష్ట పెరిగేలా కృషి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మోతారపు శ్రావణి సుధాకర్ , ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .