దోపిడి కేసులో ముగ్గురు నిందితులు అరెస్ట్.

దోపిడి కేసులో ముగ్గురు నిందితులు అరెస్ట్.

స్టేషన్ ఘనపూర్, మే 25 (తెలంగాణ ముచ్చట్లు):

జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ శివారులోని లిటిల్ ఫ్లవర్ పాఠశాల సమీపంలో ఉన్న సిరిరామ్ మోటార్స్ దుకాణంలో జరిగిన దోపిడి కేసులో మరో ముగ్గురు నిందితులను ఘనపూర్ పోలీసులు అరెస్ట్ చేసి న్యాయస్థాన రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వేణు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ నెల 16వ తేదీ తెల్లవారుజామున సుమారు 1:10 గంటల సమయంలో ఐదుగురు గుర్తుతెలియని వ్యక్తులు కలిసి సిరిరామ్ మోటార్స్ దుకాణంలోకి ప్రవేశించారు. దుకాణ యజమాని బైరరామ్‌ను బెదిరించి ఒకచోట కూర్చోబెట్టి, దుకాణంలో ఉన్న 26 యాడ్ బ్లూ ద్రావక బకెట్లు, అతని పర్సు మరియు కౌంటర్లో ఉన్న రూ.10 వేల నగదును అపహరించి పరారయ్యారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఘనపూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టి, ఇప్పటికే ఒక నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారు. అనంతరం మిగిలిన నిందితులలో ముగ్గురిని అదుపులోకి తీసుకొని సోమవారం న్యాయస్థానంలో హాజరుపరచగా రిమాండ్ విధించినట్లు సీఐ వేణు వెల్లడించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .