విద్యుత్ శాఖ నిర్లక్ష్యంపై బాధిత రైతుల ఆగ్రహం.

విద్యుత్ శాఖ నిర్లక్ష్యంపై బాధిత రైతుల ఆగ్రహం.

ఎల్కతుర్తి, మే 22 (తెలంగాణ ముచ్చట్లు):

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం పరిధిలోని దండేపల్లి గ్రామం లో విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గ్రామంలో లూజుగా IMG-20260522-WA0106ఉన్న కరెంటు తీగలు ఒకదానికొకటి తగలడంతో స్పార్కులు ఏర్పడి మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో దాదాపు 20 ఎకరాల వరి గడ్డి కాలిపోగా, సుమారు 50 మామిడి చెట్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.
బాధిత రైతు వద్దెల్లి అన్నారావు మాట్లాడుతూ గ్రామంలో చాలా చోట్ల విద్యుత్ తీగలు ప్రమాదకరంగా వేలాడుతున్నాయని, పలుమార్లు అధికారులకు తెలియజేసినా స్పందించలేదని ఆరోపించారు. వేసవి కాలంలో తీగల రాపిడి కారణంగా స్పార్కులు ఏర్పడి మంటలు వ్యాపిస్తున్నాయని తెలిపారు.
ఈ ప్రమాదంతో తీవ్ర నష్టం వాటిల్లిందని, విద్యుత్ శాఖ నిర్లక్ష్యమే ఘటనకు కారణమని గ్రామ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు. అలాగే ప్రభుత్వం స్పందించి నష్టపోయిన రైతులను ఆదుకుని ఆర్థిక సహాయం అందించాలని బాధితులు విజ్ఞప్తి చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .