జమ్మికుంట స్పోర్ట్స్ క్లబ్ నూతన కమిటీ ఎంపిక.
అధ్యక్షుడిగా వోజ్జ రాజు – ప్రధాన కార్యదర్శిగా గండికోట సమ్మయ్య
జమ్మికుంట టౌన్ మే 18 (తెలంగాణ ముచ్చట్లు):
గత నాలుగు దశాబ్దాలుగా అథ్లెటిక్స్ రంగంలో జమ్మికుంటకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన జమ్మికుంట స్పోర్ట్స్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని సోమవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.
ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ, జమ్మికుంట స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీలలో పాల్గొన్న క్రీడాకారులు అనేక పతకాలు సాధించి జమ్మికుంటతో పాటు కరీంనగర్ జిల్లా, నాటి ఆంధ్రప్రదేశ్, నేటి తెలంగాణ రాష్ట్రానికి గుర్తింపు తీసుకువచ్చారని కొనియాడారు.
నూతన కమిటీలో గౌరవ అధ్యక్షులుగా రామ్ రాజబాబు, మార్కండేయ, దొడ్డ కుమారస్వామిలను ఎంపిక చేశారు. సలహాదారులుగా ఆర్‌పీఎఫ్ రమేష్, హెడ్ కానిస్టేబుల్ సంపత్, రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్ మారపల్లి మొగులయ్యలను నియమించారు.
అధ్యక్షుడిగా అంతర్జాతీయ క్రీడాకారుడు వోజ్జ రాజును ఎన్నుకోగా, ఉపాధ్యక్షులుగా రామ్ శ్రీనివాస్, ఎగిత అశోక్, డాక్టర్ అంబాల ప్రభాకర్ (ప్రభు), వంతడుపుల రఘులను ఎంపిక చేశారు. ప్రధాన కార్యదర్శిగా గండికోట సమ్మయ్య, సహాయ కార్యదర్శులుగా బుర్ర కుమార్, కొలుగూరి సురేష్ బాధ్యతలు స్వీకరించారు. కోశాధికారిగా తిరుపతి శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులుగా మాచర్ల రాజు, సమ్మయ్య (బ్యాంక్)లను ఎన్నుకున్నారు.
గ్రౌండ్ కోచ్‌లుగా కొలుగూరి నరేష్, కొయ్యడ సాయికృష్ణలను ఎంపిక చేశారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు వోజ్జ రాజుతో పాటు ఇటీవల జమ్మికుంట మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయం సాధించిన ఎగిత అశోక్, కొలుగూరి సురేష్, మాచర్ల రాజు, అలాగే గ్రౌండ్ కోచ్‌లు కొలుగూరి నరేష్, కొయ్యడ సాయికృష్ణలను క్రీడాకారులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.


Comments