మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే మేఘారెడ్డి ఆర్థిక చేయూత.

మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే మేఘారెడ్డి ఆర్థిక చేయూత.

పెద్దమందడి,మే14(తెలంగాణ ముచ్చట్లు):
 
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలోని పామిరెడ్డిపల్లి గ్రామంలో అనారోగ్య కారణాలతో వడ్డే పెద్ద బాలస్వామి, బర్ల మల్లయ్య మృతి చెందడంతో కాంగ్రెస్ నాయకులు శ్రీశైలం కార్యకర్తలతో కలిసి గురువారం వారి కుటుంబాలను పరామర్శించారు.ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తరఫున మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ తక్షణ సహాయంగా ఒక్కో కుటుంబానికి రూ.5000/- వేల ఆర్థిక సహాయం అందజేశారు.బాధిత కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని నాయకులు భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మధిర శ్రీశైలం, ఉప సర్పంచ్ రాములమ్మ హనుమంతు, వార్డు సభ్యులు కొంకలి నరేష్, కావలి కృష్ణ, నాయకులు కొంకల్లి నరసింహ, లక్ష్మారెడ్డి, సిద్దు, చందు, షౌకత్ తదితరులు పాల్గొన్నారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .