జమ్మికుంట మున్సిపాలిటీలో జీతాల పెంపు పేరిట లక్షల వసూళ్లు..?

జమ్మికుంట మున్సిపాలిటీలో జీతాల పెంపు పేరిట లక్షల వసూళ్లు..?

జమ్మికుంట టౌన్ మే 15 (తెలంగాణ ముచ్చట్లు):

జమ్మికుంట మున్సిపాలిటీలో పాలన గాడితప్పిందనే విమర్శలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రజలకు సేవలు అందించాల్సిన మున్సిపల్ కార్యాలయం ఇప్పుడు ఉద్యోగుల నుంచే భారీ వసూళ్లు చేసే కేంద్రంగా మారిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వేతనాల పెంపు పేరిట జరుగుతున్న ఈ అక్రమ వ్యవహారం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
మున్సిపాలిటీలో సానిటరీ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న ఓ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి అధికారులతో తనకున్న సన్నిహిత సంబంధాలను అడ్డుపెట్టుకుని తోటి ఉద్యోగులపై ఒత్తిడి తెస్తున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. “డబ్బులు ఇస్తేనే జీతాలు పెరుగుతాయి.. లేకపోతే మీ ఫైలు కదలదు” అంటూ బెదిరింపులకు పాల్పడినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.
ఈ వ్యవహారంలో ముఖ్యంగా డ్రైవర్లు తీవ్రంగా నష్టపోయినట్లు సమాచారం. ఎనిమిది మంది డ్రైవర్ల నుంచి ఒక్కొక్కరి వద్ద రూ.80 వేల చొప్పున, మరో ఇద్దరి వద్ద రూ.50 వేల చొప్పున వసూలు చేసినట్లు తెలుస్తోంది. మొత్తం రూ.7.40 లక్షల వరకు అక్రమంగా వసూళ్లు జరిగాయని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
ఇంకా ఆందోళనకర విషయం ఏమిటంటే.. సీనియార్టీ ప్రకారం అర్హత ఉన్న వారిని పక్కనపెట్టి, భారీగా ముడుపులు చెల్లించిన వారికే వేతనాల పెంపు వర్తింపజేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఇంత జరుగుతున్నా మున్సిపల్ అధికారులు, పాలకవర్గం స్పందించకపోవడంపై ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిందితుడి వెనుక రాజకీయ అండ ఉందా అనే చర్చ కూడా సాగుతోంది.
వేతనాల పెంపులో జరిగిన అవకతవకలు, లక్షల రూపాయల లావాదేవీలపై జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి సమగ్ర విచారణ జరపాలని బాధితులు, స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ప్రాణాలు కాపాడే తొలి గంటే “గోల్డెన్ అవర్” ప్రాణాలు కాపాడే తొలి గంటే “గోల్డెన్ అవర్”
రోడ్డు ప్రమాద బాధితులను వెంటనే ఆసుపత్రికి తరలించాలిమెడికవర్ వైద్యులు రాజీవ్ రెడ్డి, వేణుగోపాల్ సూచనలు* హుజురాబాద్‌, మే 15(తెలంగాణ ముచ్చట్లు ): రోడ్డు ప్రమాదాల సమయంలో ప్రమాదం...
డీసీఎం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు.. జమ్మికుంటలో కేసు నమోదు.
అపర భగీరధుడు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కి ఘన సత్కారం.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యధావిధిగా కొనసాగించాలి.
దొడగుంటపల్లి మత్స్య సహకార సంఘం అధ్యక్షుడిగా జంగం గోపాల్ ఏకగ్రీవ ఎన్నిక.
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్ పూర్తి చేయాలి
జమ్మికుంట మున్సిపాలిటీలో జీతాల పెంపు పేరిట లక్షల వసూళ్లు..?