ఘనంగా మల్లికార్జునస్వామి ప్రతిష్ఠాపన మహోత్సవం.
Views: 11
On
భీమదేవరపల్లి, ఏప్రిల్ 4 (తెలంగాణ ముచ్చట్లు):
మండలంలోని ముల్కనూర్ గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి ప్రతిష్ఠాపన మహోత్సవం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
నాగిళ్ల కృష్ణమూర్తి శర్మ ఆధ్వర్యంలోని పౌరోహిత్య బృందం వేదమంత్రోచ్చరణల మధ్య కార్యక్రమాలను నిర్వహించింది. గోపూజతో ప్రారంభమైన ఈ మహోత్సవం జలాధివాసం, ధాన్యాధివాసం వంటి పూజా కార్యక్రమాలతో కొనసాగింది. అనంతరం శ్రీ మల్లికార్జున స్వామి వారి చరిత్రను ఒగ్గుకథ రూపంలో వినిపించగా, పెద్దపట్నం కార్యక్రమం కూడా నిర్వహించారు.
దేవతా విగ్రహాల ప్రతిష్ఠ కార్యక్రమంలో ముదిరాజ్ కులస్తులు సంప్రదాయబద్ధంగా పూస్తే మట్టెలను తీసుకువచ్చి పాల్గొన్నారు. అగ్నిగుండ ప్రజ్వలనతో ప్రతిష్ఠాపన కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది.
కులాలకు అతీతంగా గ్రామ ప్రజలందరూ కలిసి మల్లికార్జున బోనాలు నిర్వహించగా, ఒగ్గు కళాకారుల ప్రదర్శనలు, శివసత్తుల ఆచారాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.
ఈ ప్రతిష్ఠ కార్యక్రమానికి సహకరించిన ప్రతి 
ఒక్కరికీ గ్రామస్థులు, యాదవ కులస్తులు స్వామి వారి ఆశీర్వాదం ఉండాలని కోరుకున్నారు.

ఒక్కరికీ గ్రామస్థులు, యాదవ కులస్తులు స్వామి వారి ఆశీర్వాదం ఉండాలని కోరుకున్నారు.Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments