నకిలీ పత్రాల ఫోర్జరీ కేసులో నిందుతుడు అరెస్ట్ రిమాండ్ కు తరలింపు.

ఖమ్మం బ్యూరో, మే 4(తెలంగాణ ముచ్చట్లు )
 
ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సీర్ .నో .289/2026 కేసు లో  మోసం, నకిలీ  ఫోర్జరీ పత్రాలు అసలైనవిగా ప్రజలను నమ్మించిన కేసులోని ప్రధాన నిందితుడు మమత హాస్పిటల్ రోడ్ నివాసి అయిన నల్లబోలు చంద్రారెడ్డి 45 సం,,  సోమవారం ఖమ్మం రూరల్ పోలీసులు అరెస్ట్ చేసి, న్యాయస్థానం ఎదుట హాజరుపరచి, రిమాండ్ కు తరలించడం జరిగిందని సిఐ రాజు తెలిపారు. పోలీసుల విచారణలో.. నిందితుడు, అతని సహచరులు కలిసి గూర్రాలపాడు గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 52, 72లో “సత్య సంకల్ప వెంచర్”  "అభయ టౌన్ షిప్ "పేరుతో లేఅవుట్ ఏర్పాటు చేసి, భూములకు ఎటువంటి చట్టబద్ధమైన నాలా మార్పిడి లేకపోయినా, నకిలీ పత్రాలు తయారు చేసి, ప్రభుత్వ అధికారుల సంతకాలు, ముద్రలను ఫోర్జరీ చేసి, ప్రజలను మోసం చేసినట్లు తేలింది.
నిందితుడు నల్లబోలు చంద్రారెడ్డి తన మాయ మాటలతో మోర్తాల నారాయణ రెడ్డి నుండి రూ.15,00,000/- తీసుకోవడంతో పాటు, గంగావత్ శంకర్, గంగావత్ మహేష్ కుమార్, కుర్ర రవికుమార్, మర్రి మౌనిక, మరికొంత మంది అమాయక ప్రజలను కూడా ఇదే విధంగా మోసం చేసినట్లు విచారణలో వెల్లడైంది. గతంలో కొనుగోలు చేసినటువంటి బాధితులు ఇంటికి బ్యాంక్ లోను రాక, ఇతరులకు అమ్ముకోలేక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
ఈ కేసులో నిందితుడికి తోడుగా పనిచేసిన మరి కొందరు  ప్రస్తుతం పరారీలో ఉన్నారు, వారిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు కొనసాగుతున్నారు. ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు కొనసాగుతోంది అని సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజు ఒక ప్రకటనలో  తెలియజేశారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .