ప్రతి నిరుపేదకు పక్కా ఇల్లు నిర్మించడమే ప్రభుత్వ ధ్యేయం..
Views: 6
On
నేరడలో ఇందిరమ్మ నూతన గృహ ప్రవేశం లో
మత్కేపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ అంబటి..
ఖమ్మం బ్యూరో, మే 4(తెలంగాణ ముచ్చట్లు )
రాష్ట్రంలో నిరుపేదలకు పక్కా ఇంద్రమ్మ ఇల్లు నిర్మించి వారి యొక్క కలల సహకారం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని మత్కేపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు తెలిపారు. సోమవారం మండల పరిధిలో నేరడ గ్రామంలో అన్నపురెడ్డి తిరుపతమ్మ పుల్లయ్య దంపతులకు మంజూరైన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశానికి హాజరై రిబ్బన్ కట్ చేసి లబ్ధిదారులు గృహప్రవేశ కార్యక్రమం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యంలో ఇల్లు లేని నిరుపేదలంటూ లేకుండా చేయడమే ప్రభుత్వం ఉద్దేశమని గత ప్రభుత్వాలతో పోలిస్తే మాయమాటలు చెప్పి పేద ప్రజలను మభ్యపెట్టి ధనికున్ని మరింత పెద్ద ధనవంతుడిగా చేసిందని పేదోని పేదోని లాగనే చేసిందని తెలిపారు. ఆయన అన్నారు వ్యాపారంలో ప్రజలందరూ సమానమేనని ఎందరమ్మ రాజ్యంలో ఇల్లు లేని నిరుపేదలుగా చూడడమే ఈ ప్రజాపాలన ప్రవక్త లక్ష్యం అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి దూసరి గోపాలరావు మాజీ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు మడిపల్లి భాస్కర్ కిసాన్ సెల్ మండల అధ్యక్షులు కొప్పుల గోవిందరావు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అన్నబోయిన గోపి నేరడ గ్రామ అధ్యక్షులు మంకెన నాగేశ్వరరావు గ్రామ ఉపసర్పంచ్ కోట బాలేష్ పులిపాటి లక్ష్మీపతి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments