వ్యాపారులు సిసిటివి కెమెరాలను,ఆటోమాటిక్ అలారం సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలి .
పోలీస్ కమిషనర్ సునీల్ దత్.
Views: 5
On
ఖమ్మం బ్యూరో, మే 4(తెలంగాణ ముచ్చట్లు )
నగల దుకాణాల పరిసరాల్లో అత్యున్నత నాణ్యత గల సిసిటివి కెమెరాలను,ఆటోమాటిక్ అలారం సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు.
ఆదివారం కరీంనగర్‌లో పిఎంజె జ్యువెలర్స్‌లో జరిగిన దోపిడీ, కాల్పుల ఘటన నేపథ్యంలో ఖమ్మం నగరంలోని నగల దుకాణాల యజమానులతో, షోరూం దుకాణాల ప్రతినిధులతో సమన్వయ సమావేశం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. సమావేశం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ... నగల దుకాణాల్లో భద్రతతో పాటు సీసీటీవీ నిఘా, అలారం వ్యవస్థలు, యాక్సెస్ కంట్రోల్ వంటి ఆధునిక భద్రతా ఏర్పాట్లు పెంచాలని సూచించారు. అదేవిదంగా మెటల్ డిటెక్టర్ పరికరాలను అమర్చుడం ద్వారా
భద్రతా ప్రమాణాలు మెరుగుపడతాయన్నారు. నగల దుకాణాల వద్ద భద్రతను విధిగా సమీక్షించాలని పోలీస్ అధికారులకు సూచించారు. అదేవిదంగా పగలు, రాత్రివేళల్లో ఆయుధాల కలిగిన పోలీస్ బృందాలతో ప్రత్యేక గస్తీ నిర్వహిస్తూ.. నిఘాను పెంచాలని పోలీసు అధికారులకు ఆదేశించారు. ఇతర రాష్ట్రాల్లో సైతం ఇటువంటి దోపిడీ ఘటనలు తరచూ జరుగుతున్న నేపథ్యంలో పునరావతం కాకుండా అడ్డుకునేందుకు నిరంతరం అప్రమత్తం ఉండాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే 100కు డయల్ చేయాలని పేర్కొన్నారు. సమావేశంలో ఏసీపీలు రమణమూర్తి, తిరుపతి రరెడ్డి, ఎస్బి ఏసీపీ మహేష్, సిఐలు కరుణాకర్, మోహన్ బాబు, బాలకృష్ణ, మురళి, సంజీవ్, రాజు తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments