విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి.

విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి.

పెద్దమందడి,ఏప్రిల్25(తెలంగాణ ముచ్చట్లు):
 
వనపర్తి జిల్లా పెద్దమందడి మండల పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది.అమ్మపల్లి గ్రామానికి చెందిన మోల్గరి హనుమంత్ రెడ్డి (65) విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, శనివారం ఉదయం ఇంటి వద్ద నీళ్ల మోటర్ ఆన్ చేస్తుండగా అనుకోకుండా విద్యుత్ షాక్ తగిలింది.ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను కొత్తకోటలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.అనంతరం మృతదేహాన్ని వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు.తర్వాత గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు.మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .