ఎర్రనగ్గిలో అడ్మిషన్ల ప్రచారం ఆపండి: ఎంఈఓ .
ఎంఈఓకు ప్రైవేట్ ఉపాధ్యాయుల వినతిపత్రం.
Views: 105
On
సత్తుపల్లి, ఏప్రిల్ 25(తెలంగాణ ముచ్చట్లు):
సత్తుపల్లిలో కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థలు గత కొన్ని నెలలుగా తరగతుల్లో పాఠాలు బోధించాల్సిన ఉపాధ్యాయులను అడ్మిషన్ల కోసం మండుటెండల్లో వీధుల వెంట తిప్పుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై విచారణ జరిపి సంబంధిత యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సత్తుపల్లి మండల ప్రైవేట్ ఉపాధ్యాయులు శనివారం ఎంఈఓ రాజేశ్వరరావుకు వినతిపత్రం సమర్పించారు. మండుటెండల్లో ప్రచారానికి వెళ్లడం వల్ల అనారోగ్యానికి గురవుతున్నామని, విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రైవేట్ విద్యాసంస్థల అడ్మిషన్ ప్రచారాన్ని మే నెలాఖరు వరకు నిలిపివేయాలని వారు కోరారు.
ప్రచారం నిలిపివేయండి: ఎంఈఓ
ఈ నేపథ్యంలో ఎంఈఓ రాజేశ్వరరావు విద్యాసంస్థల యాజమాన్యాలకు హెచ్చరికలు జారీ చేశారు. ఉపాధ్యాయులను అడ్మిషన్ల పేరుతో మండుటెండల్లో తిరగనివ్వవద్దని సూచించారు. శనివారం తన కార్యాలయంలో పాఠశాల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించిన ఆయన, ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురి చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే అడ్మిషన్ ప్రచారంలో భాగంగా ఇతర పాఠశాలలపై అసత్య ప్రచారం చేయవద్దని సూచించారు. సత్తుపల్లి పట్టణంలో సీబీఎస్ఈ గుర్తింపు కలిగిన పాఠశాలలు లేవని ఆయన స్పష్టం చేశారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments