పామిరెడ్డిపల్లిలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం.
Views: 20
On
పెద్దమందడి,ఏప్రిల్23(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామంలో సింగిల్ విండో సొసైటీ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వనపర్తి మార్కెట్ వ్యవసాయ వైస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి పాల్గొని కేంద్రాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతి గింజను కొనుగోలు చేస్తుందని, రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. రైతులు తమ పంటను ధైర్యంగా కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం, ఉప సర్పంచ్ రాములమ్మ, మాజీ జెడ్పిటిసి సభ్యులు వెంకటస్వామి, వార్డు సభ్యులు కృష్ణ, సొసైటీ స్పెషల్ ఆఫీసర్ మహమ్మద్ అలీ, సీఈఓ జగదీష్, సుధాకర్ మరియు రైతులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments