దుబ్బ మల్లికార్జున స్వామి దేవస్థానం పాలకవర్గానికి ఘన సన్మానం.
Views: 19
On
జమ్మికుంట టౌన్ ఏప్రిల్ 20 (తెలంగాణ ముచ్చట్లు):
జమ్మికుంట మండలం ధర్మారం పరిధిలోని శ్రీ దుబ్బ మల్లికార్జున స్వామి దేవస్థానం కొత్త పాలకవర్గం ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆలయ చైర్మన్ ఇంగిలే రామారావు ఆధ్వర్యంలో ఘన సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ ముద్ధమల్ల రవీందర్‌తో పాటు పాలకవర్గ సభ్యులను శాలువాలతో సత్కరించారు.
ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ, మహిమాన్వితమైన దుబ్బ మల్లికార్జున స్వామివారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. కొత్త పాలకవర్గానికి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని స్వామివారిని ప్రార్థించారు. దేవస్థానానికి వచ్చే భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించి, ఆలయాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎఎంసీ ఉపాధ్యక్షుడు సతీష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సలీం, యువ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు, శ్రీనివాస్, అశోక్, నెల్లి అశోక్ తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments