ప్రజలకు ఉపయోగపడని వైకుంఠదామం .

ప్రజలకు ఉపయోగపడని వైకుంఠదామం .

వేలేరు, ఏప్రిల్ 18 (తెలంగాణ ముచ్చట్లు):
 
వేలేరు మండలం పీచర గ్రామంలో నిర్మించిన వైకుంఠధామం ప్రజలకు ఉపయోగపడని స్థితిలో ఉందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఈ స్మశానవాటికను నిర్మించడంతో అక్కడికి చేరుకోవడం కష్టంగా మారిందని వారు చెబుతున్నారు.ఈ కారణంగా గ్రామ ప్రజలు వైకుంఠధామాన్ని వినియోగించుకోలేకపోతూ, గ్రామంలో ఉన్న జంగం కుంట మరియు ఎల్లమ్మ వాగు వద్దే దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ నిధులతో నిర్మించిన స్మశానవాటిక ప్రజలకు ఉపయోగపడకపోవడంపై పలువురు అధికారులపై మండిపడుతున్నారు.
ప్రజల అవసరాలను పరిగణలోకి తీసుకోకుండా ఇలాంటి నిర్మాణాలు చేపట్టడం వల్ల ప్రయోజనం లేకుండా పోతుందని, తక్షణమే సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .