గుర్తు తెలియని మృతదేహం కలకలం.!

సత్తుపల్లి సింగరేణి క్వార్టర్స్‌ దగ్గర ఘటన.

గుర్తు తెలియని మృతదేహం కలకలం.!

సత్తుపల్లి, మార్చి 30(తెలంగాణ ముచ్చట్లు):

సత్తుపల్లి సింగరేణి క్వార్టర్స్ ప్రాంతంలోని జామాయిల్ తోటలో గుర్తు తెలియని మగ వ్యక్తి మృతదేహం లభ్యమవడం కలకలం రేపింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించగా, సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించారు. మృతదేహం బాగా కుళ్లిపోయి అస్థిపంజరంలా మారిన స్థితిలో ఉండటం వల్ల గుర్తింపు కష్టంగా మారింది. మృతుడు నీలం రంగు ప్యాంటు ధరించి ఉండగా, కుడి చేతికి ఎరుపు రంగు దారం కట్టుకున్నట్లు గుర్తించారు. దవడ భాగంలో శస్త్రచికిత్స చేసినట్లు ఐరన్ ప్లేట్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వయస్సు సుమారు 25 నుంచి 30 సంవత్సరాల మధ్యగా అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, మృతదేహాన్ని సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతుడి వివరాలు తెలిసిన వారు సత్తుపల్లి పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని కోరారు. ఫోన్ నెంబర్: 87126 59167, 8712551362

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .