నేరెడీమేట్–యాప్రల్‌లో శిక్షణ మహాభియాన్ విజయవంతం
_ముఖ్య అతిథి ఎంపీ ఈటెల రాజేందర్
– కార్యకర్తలకు మార్గదర్శనం
నేరెడీమేట్, మార్చి 29 (తెలంగాణ ముచ్చట్లు):
మల్కాజ్గిరి నియోజకవర్గం నేరెడీమేట్ మరియు యాప్రల్ డివిజన్‌లలో నిర్వహిస్తున్న పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రచిక్షణ మహాభియాన్ – 2026 శిక్షణ తరగతులు విజయవంతంగా కొనసాగుతున్నాయి. మొదటి రోజు కార్యక్రమానికి ఎంపీ ఈటెల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరై శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి శిక్షణ కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని, కార్యకర్తలు సిద్ధాంతాలను అవగాహన చేసుకుని ప్రజాసేవలో ముందుండాలని సూచించారు.ఈ కార్యక్రమం లో గీత మూర్తి (నేషనల్ కౌన్సిలింగ్ మెంబర్), వేముల వేణుగోపాల్ (స్టేట్ సోషల్ మీడియా కో-కన్వీనర్), అకెళ్ళ శర్మ (సీనియర్ నాయకుడు), మల్లిక (క్లస్టర్ ఇంచార్జి) పాల్గొని శిక్షణార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. రాష్ట్ర పార్టీ నుంచి విశిష్ట అతిథిగా బద్దం మహిపాల్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు.డివిజన్ అధ్యక్షుడు ఆదిత్య భరద్వాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉపేందర్ రెడ్డి, గోపు రమణ రెడ్డి, సత్యనారాయణ, శర్మ, పరాస్ జైన్, రాజి రెడ్డి, శ్యామ్, పర్వతాలు దినేష్, కృష్ణ మోహన్, బీర్ సింగ్, సుదర్శని, మల్లిక, శాలిని తదితర నాయకులు పాల్గొన్నారు.అలాగే డివిజన్ కమిటీ సభ్యులు, కౌన్సిల్ సభ్యులు, ప్రధాన కార్యదర్శులు, వివిధ మోర్చాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై శిక్షణ శిబిరాన్ని విజయవంతం చేశారు.


Comments