భక్తి భజన సంకీర్తనలే సన్మార్గానికి మార్గం
మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి
వనపర్తి,మార్చి20(తెలంగాణ ముచ్చట్లు):
మనిషిని సన్మార్గంలో నడిపించే ఏకైక సాధనం భక్తి భజన సంకీర్తనలేనని మాజీ రాజ్యసభ సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు.ఉగాది పండుగను పురస్కరించుకుని శుక్రవారం వనపర్తి సాహితీ కళా వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు భక్తి భజన సంకీర్తనాపరులను ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, భారతీయ సంప్రదాయంలో భక్తికి ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు.అనేక మంది సంకీర్తనాపరులు సమాజాన్ని సన్మార్గంలో నడిపించేందుకు భక్తి మార్గాన్ని చూపారని చెప్పారు. ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ భజన కీర్తనలకు ప్రాణం పోస్తున్న కళాకారులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.పెబ్బేరు, కంచిరావుపల్లి, తాటిపాముల, వెంకటాపూర్, జానంపేట, కంబాలాపురం తదితర గ్రామాలకు చెందిన దాదాపు 50 మంది కళాకారులను శాలువా, జ్ఞాపికలు మరియు కొత్త సంవత్సరం పంచాంగంతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్, బైరోజు చంద్రశేఖర్, జిల్లా రంగస్థల కళాకారుల సంఘం అధ్యక్షుడు ఎల్.ఉమామహేశ్వర్, కరేస్వామి, వనం రాములు, నందిమల్ల అశోక్, కరుణశ్రీ, దిలీప్ రెడ్డి, సితార వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


Comments