ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యదర్శిగా శీలం బ్రహ్మారెడ్డి.

ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యదర్శిగా శీలం బ్రహ్మారెడ్డి.

- పార్టీ అగ్రనాయకత్వానికి కృతజ్ఞతలు.
- పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని హామీ.

కల్లూరు, మార్చి 20 (తెలంగాణ ముచ్చట్లు):

ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శీలం బ్రహ్మారెడ్డి నియమితులయ్యారు. కల్లూరు మండలంలోని బత్తులపల్లి గ్రామానికి చెందిన ఆయన, దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన పార్టీ అగ్రనాయకత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నూతి సత్యనారాయణలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా, నాయకుల మార్గదర్శకత్వంలో కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం కావడానికి తన సాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .