కుషాయిగూడలో మహిళ అదృశ్యం

కేసు నమోదు, గాలింపు చర్యలు ప్రారంభం

కుషాయిగూడలో మహిళ అదృశ్యం

కుషాయిగూడ, మార్చి 19 (తెలంగాణ ముచ్చట్లు): 

కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. నాగార్జున నగర్ కాలనీ, చక్రిపురం నివాసి గోపరాజు మహేష్ (33) ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.పోలీసుల వివరాల ప్రకారం, మహేష్ తన భార్య గోపరాజు మానస (25) కనిపించకపోవడంతో ఫిర్యాదు చేశాడు. 2022లో వరంగల్‌కు చెందిన మానసతో వివాహం జరిగిన ఈ దంపతులు గత నాలుగేళ్లుగా చక్రిపురంలో నివాసం ఉంటున్నారు. మార్చి 18న ఉదయం 7:40 గంటలకు మహేష్ ఉద్యోగరీత్యా సీబీఎస్ఈ పేపర్ కరెక్షన్ కోసం హిమాయత్ నగర్‌కు వెళ్లగా, సాయంత్రం 6:30 గంటలకు ఇంటికి వచ్చేసరికి భార్య ఇంట్లో లేకపోవడం గమనించాడు.చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో కూడా మానస ఇంటి నుంచి వెళ్లిపోవడంతో వరంగల్‌లోని ఇంతేజ్గంజ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాగా, పోలీసులు ఆమెను గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు సమాచారం. ప్రస్తుతం ఇదే రెండోసారి ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.మిస్సింగ్ మహిళ ఎత్తు సుమారు 4.5 అడుగులు, చామన చాయ రంగులో ఉండగా, కుడి చేతి మోచేతి వద్ద కాలిన మచ్చ గుర్తుగా ఉంది. చివరిసారిగా పసుపు రంగు పంజాబీ డ్రెస్ ధరించి ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు ప్రారంభించారు. మహిళ ఆచూకీ తెలిసిన వారు సమీప పోలీస్ స్టేషన్‌ను సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .