మేడ్చల్ కలెక్టరేట్ వద్ద ఆశా వర్కర్ల ఆందోళన ఉద్రిక్తం

మేడ్చల్ కలెక్టరేట్ వద్ద ఆశా వర్కర్ల ఆందోళన ఉద్రిక్తం

_పోలీసుల అడ్డంకులతో ఉద్రిక్త పరిస్థితి

_సీఐటీయూ నాయకుల అరెస్టులు

_ఫిక్స్డ్ వేతనాలపై ప్రభుత్వంపై ఆగ్రహం

మేడ్చల్ మల్కాజ్గిరి, మార్చి 17 (తెలంగాణ ముచ్చట్లు):

మేడ్చల్ కలెక్టరేట్ వద్ద తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ అనుబంధం) ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. తమ సమస్యల పరిష్కారం కోసం ఆశా వర్కర్లు భారీగా చేరుకుని నిరసన చేపట్టగా, పోలీసులు అడ్డుకోవడంతో తోపులాటలు చోటుచేసుకుని ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో పలువురు ఆశా వర్కర్లతో పాటు సీఐటీయూ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని బొల్లారం, జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లకు తరలించారు.
ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు పి. జయలక్ష్మి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కారం కాలేదని విమర్శించారు. గత 20 ఏళ్లుగా పేద ప్రజలకు సేవలు అందిస్తున్న ఆశా వర్కర్లకు కనీసం రూ.18,000 ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా ఇన్సూరెన్స్, ఈఎస్‌ఐ, పీఎఫ్ వంటి సౌకర్యాలు కల్పించి, ఇతర ఖర్చుల కోసం రూ.50,000 మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ అంశాలను అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలని డిమాండ్ చేశారు.సీఐటీయూ మేడ్చల్ జిల్లా కార్యదర్శి ఎర్ర అశోక్ మాట్లాడుతూ, ఆశా వర్కర్ల శ్రమను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఆశలకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.పోలీసుల నిర్బంధాలను ఛేదించి 48 గంటల నిరసనలో పాల్గొన్న ఆశా వర్కర్లు తమ సమస్యలను కలెక్టరేట్‌కు విన్నవించేందుకు వెళ్లగా, అక్రమంగా అరెస్టు చేశారని నాయకులు ఆరోపించారు. అరెస్టులతో ఉద్యమాలను అణచలేరని హెచ్చరిస్తూ, ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం కొనసాగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆశా యూనియన్ జిల్లా నాయకులు రేవతి, అనిత, ఐ. రాజశేఖర్, బి. లింగస్వామి, పి. గణేష్, ఆర్. సంతోష్, ఎం. నరేష్, శంకరమ్మ, రమ, సబియా, పద్మ, వసంత, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.IMG-20260317-WA0068

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .