మద్దిగట్ల - మోజర్ల పాఠశాలలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు.

మద్దిగట్ల - మోజర్ల పాఠశాలలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు.

పెద్దమందడి,ఆగస్టు14(తెలంగాణ ముచ్చట్లు):

పెద్దమందడి మండలం మద్దిగట్ల- మోజర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉదయం 6 గంటలకు మద్దిగట్ల, మోజర్ల గ్రామాల్లో బ్యాండ్ మేళంతో ప్రభాతభేరీ నిర్వహించి విద్యార్థులు దేశభక్తిని చాటారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు ఎస్. వరప్రసాద్ రావు జాతీయ జెండాను ఆవిష్కరించి మహనీయులకు నివాళులర్పించారు.ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం కోసం ఎందరో మహనీయులు చేసిన త్యాగాలను స్మరించుకోవాలని అన్నారు. ఉపాధ్యాయులు పి. వెంకటస్వామి, శ్రీనివాసులు, వాణి ప్రభ విద్యార్థులకు క్రమశిక్షణ, విద్యా ప్రాధాన్యతను వివరించారు. విద్యార్థులు మనోజ్, మౌనిక, మాసన్నగౌడ్ స్వాతంత్ర్య దినోత్సవ ప్రాధాన్యతపై ప్రసంగించారు.అనంతరం మధుసూదన్ ఆధ్వర్యంలో విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. గత విద్యా సంవత్సరంలో పదో తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన కుమార్ దీప్తి, ఆమె తల్లిదండ్రులు పాలెం రవి, మహాలక్ష్మిలను మోజర్ల గ్రామ పెద్దలు ఘనంగా సన్మానించారు. అలాగే ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందాన్ని సత్కరించారు.వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలకు ప్రధానోపాధ్యాయులు ఎస్. వరప్రసాద్ రావు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గద్వాల కృష్ణ, పుల్లయ్య, ఎన్. వెంకటస్వామి, ఏ. వెంకటస్వామి, టీ.కే. ప్రవీణ్ కుమార్, కృష్ణవేణి, చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .