పోచమ్మ తల్లి ఆలయంలో బోరుబావికి శ్రీకారం.
ఆలయ అభివృద్ధికి బండి శ్రీకాంత్ చేయూత.
జమ్మికుంట టౌన్ ఆగస్టు 14 (తెలంగాణ ముచ్చట్లు):
జమ్మికుంట పట్టణంలోని 11వ వార్డులో ఉన్న శ్రీ పోచమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో బోరు బావి ఏర్పాటుకు పనులు ప్రారంభమయ్యాయి. బోరు బావి ఏర్పాటుకు సహకరిస్తున్న బండి శ్రీకాంత్‌ను మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ మర్యాదపూర్వకంగా శాలువాతో సత్కరించి, మున్సిపాలిటీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం కొబ్బరికాయ కొట్టి బోరు బావి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ పోచమ్మ తల్లి ఆశీర్వాదంతో బోరు బావిలో సమృద్ధిగా నీరు లభించాలని ఆకాంక్షించారు. అమ్మవారి కృపాకటాక్షాలతో జమ్మికుంట పట్టణ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు.
కార్యక్రమంలో కౌన్సిలర్లు పొనగంటి విష్ణు, పొనగంటి రాము, శీలం శ్రీనివాస్, కొలుగూరి సురేష్, తూర్పాటి చందన శంకర్, మంద రాజేష్, పొనగంటి అంజయ్య, శివగంగ బోర్ వెల్స్ నిర్వాహకులు తూర్పాటి పోచయ్య, బిట్ల తిరుపతి తదితరులు పాల్గొన్నారు.


Comments