శ్రీశైలం నీటిని కేఎల్‌ఐ ద్వారా అందించే అవకాశాలు పరిశీలించాలి.

వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి.

శ్రీశైలం నీటిని కేఎల్‌ఐ ద్వారా అందించే అవకాశాలు పరిశీలించాలి.

వనపర్తి,ఆగస్టు12(తెలంగాణ ముచ్చట్లు):

ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో రైతులు నష్టపోకుండా ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకోవాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సూచించారు. ఇప్పటికే వరి సాగు చేసిన రైతులను ఆదుకునేందుకు అవసరమైన మేరకు సాగునీరు అందించాలని, శ్రీశైలం నీటిని కేఎల్‌ఐ ద్వారా అందించే అవకాశాలను పరిశీలించాలని కోరారు.బుధవారం వనపర్తి జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధ్యక్షతన నిర్వహించిన సాగునీటి సలహా మండలి సమావేశంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరితో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, నీటిపారుదల, వ్యవసాయ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రస్తుత వర్షాభావ పరిస్థితులు, ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు, సాగు, తాగునీటి అవసరాలపై సమీక్షించారు.ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ.. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా నార్లాపూర్, ఏదుల, వట్టెం రిజర్వాయర్లను నింపేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కొంతమేర నీటిని విడుదల చేయగలిగితే ఇప్పటికే వరి సాగు చేసిన రైతులు నష్టపోకుండా బయటపడే అవకాశం ఉంటుందని తెలిపారు. కొత్తకోట మండలంలోని శంకర సముద్రం రిజర్వాయర్‌ను కూడా నింపేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.రైతుల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని అందుబాటులో ఉన్న ప్రతి నీటి వనరును సమర్థవంతంగా వినియోగించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. భవిష్యత్‌లో నీటి కొరత సమస్య తలెత్తకుండా రైతులను ఆరుతడి పంటల వైపు మళ్లించాలని, నీటి లభ్యతపై ముందుగానే అవగాహన కల్పించాలని సమావేశంలో సూచించారు.సమావేశంలో ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు, నీటిపారుదల, వ్యవసాయ శాఖల ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News