అర్హులైన ప్రతి ఓటరే లక్ష్యం.. క్షేత్రస్థాయిలో విస్తృత పరిశీలన.

అర్హులైన ప్రతి ఓటరే లక్ష్యం.. క్షేత్రస్థాయిలో విస్తృత పరిశీలన.

జమ్మికుంట టౌన్, ఆగస్టు 01 (తెలంగాణ ముచ్చట్లు):

హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ బాబు ఆదేశాల మేరకు జమ్మికుంట పట్టణంలోని 204, 205 పోలింగ్ బూత్‌ల పరిధిలో ఓటరు జాబితా ప్రత్యేక ధృవీకరణ కార్యక్రమాన్ని వేగవంతంగా నిర్వహిస్తున్నారు. అర్హత కలిగిన ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుంచి మిస్ కాకుండా ఉండేలా బూత్ అధ్యక్షులు, బీఎల్‌వోలు సమన్వయంతో విస్తృతంగా కృషి చేస్తున్నారు.
పట్టణానికి వెలుపల నివసిస్తున్న ఓటర్లను సైతం ఫోన్ ద్వారా సంప్రదించి వారి వివరాలను నిర్ధారిస్తూ, అవసరమైన సమాచారాన్ని బీఎల్‌వోలకు అందజేస్తున్నారు. దీంతో ఓటరు జాబితా సవరణ ప్రక్రియ వేగంగా పూర్తయ్యే దశకు చేరుకుంది.
ఈ సందర్భంగా జమ్మికుంట మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ దేశిని కోటి మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఓటు అత్యంత విలువైనదని అన్నారు. అర్హులైన ఓటర్ల పేర్లు జాబితాలో నమోదు అయ్యేలా కృషి చేస్తున్న బూత్ అధ్యక్షులు, బీఎల్‌వో అధికారుల సేవలు ప్రశంసనీయమIMG-20260801-WA0023ని కొనియాడారు. ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో ప్రజలందరూ సహకరించి తమ వివరాలను సరిచూసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

*అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం. *అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం.
* ఆగస్టు 15 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు.. ఇంటర్ అర్హత కలిగిన స్థానిక మహిళలకు అవకాశం జమ్మికుంట టౌన్ ఆగస్టు 01 (తెలంగాణ ముచ్చట్లు):...
అర్హులైన ప్రతి ఓటరే లక్ష్యం.. క్షేత్రస్థాయిలో విస్తృత పరిశీలన.
వీణవంకలో 'సర్' ఫారాల డిజిటలైజేషన్ 99 శాతం పూర్తి.
దుర్గమ్మ, పోచమ్మ ఆలయాల్లో మినీ వాటర్ ట్యాంకుల నిర్మాణానికి శంకుస్థాపన.
సత్తుపల్లిలోనే వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేయాలి.
ఫీల్డ్ అసిస్టెంట్లకు నిరసన కార్యక్రమాలతో సంబంధం లేదు.
వెల్టూర్ గ్రామంలో సర్పంచ్ అశోక్, వార్డు సభ్యుల క్షేత్రస్థాయి పర్యటన.