ఒకే దేశం.. ఒకే ఓటు లక్ష్యానికి సహకరించాలి.

పురుషోత్తం రెడ్డి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు.

ఒకే దేశం.. ఒకే ఓటు లక్ష్యానికి సహకరించాలి.

పెద్దమందడి,జూలై21(తెలంగాణ ముచ్చట్లు): 

ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియకు ప్రతి పౌరుడు సహకరించాలని, ఒకే దేశం.. ఒకే ఓటు లక్ష్య సాధనలో భాగస్వాములు కావాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పురుషోత్తం రెడ్డి పిలుపునిచ్చారు.మంగళవారం పెద్దమందడి మండలం చిన్నమందడి గ్రామంలో బీజేపీ మండల అధ్యక్షుడు ముప్పురి చెన్నయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఎస్‌ఐఆర్ అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, ప్రపంచంలోనే భారత ఎన్నికల వ్యవస్థకు ప్రత్యేక గుర్తింపు ఉందని, ఓటరు జాబితాను పారదర్శకంగా రూపొందించడంతో పాటు ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓటు లేకుండా చేయడమే ఎన్నికల సంఘం లక్ష్యమని అన్నారు.అందుకోసం ప్రతి అర్హ ఓటరు ఎన్యుమరేషన్ ఫారాలను పూర్తి చేసి సంబంధిత అధికారులకు అందజేయాలని సూచించారు. ఫారాలు సమర్పించని పక్షంలో ఓటు కోల్పోయే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. బీజేపీ కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించి, ఒక్కరికి ఒకే ఓటు ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి సుక్క మధు, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు గొడుగు నరేందర్, సీనియర్ నాయకుడు డి. విట్టల్ రెడ్డి, బూత్ అధ్యక్షుడు మార్చరాజు, పెద్ది రామకృష్ణ, జి. పవన్ కుమార్, కే. రాముడు, పార్టీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

పామిడిరెడ్డిపల్లిలో ఓటరు దరఖాస్తుల ప్రక్రియ విజయవంతం. పామిడిరెడ్డిపల్లిలో ఓటరు దరఖాస్తుల ప్రక్రియ విజయవంతం.
పెద్దమందడి,జూలై30(తెలంగాణ ముచ్చట్లు): ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం పామిడిరెడ్డిపల్లి గ్రామానికి సంబంధించిన ఓటరు దరఖాస్తులను బూత్‌వారీగా 100% శాతం పూర్తి చేసిన...
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం.
పదోన్నతి ఉద్యోగులకు కొత్త ఉత్సాహం.
రైతులు నీటి నిల్వకుంటలు ఏర్పాటు చేసుకోవాలి.
ఎమ్మెల్యే రాగమయి ప్రత్యేక దృష్టి.. ఎస్‌ఐఆర్‌లో సత్తుపల్లికి గుర్తింపు.
వెల్టూర్ లో బీఎల్‌ఓల కృషి,ప్రజల సహకారంతో ఎస్‌ఐఆర్ ప్రక్రియ విజయవంతం.
కుదించిన ప్రింట్ మీడియా వార్త ఇలా ఉంటుంది: