ఓటు విలువను నేర్పిన శస్త్ర పబ్లిక్ స్కూల్.

ప్రజాస్వామ్య విలువలపై విద్యార్థులకు ప్రత్యక్ష అవగాహన.

ఓటు విలువను నేర్పిన శస్త్ర పబ్లిక్ స్కూల్.

హుజూరాబాద్, జూలై 18(తెలంగాణ ముచ్చట్లు ):

హుజూరాబాద్ పట్టణంలోని శస్త్ర పబ్లిక్ స్కూల్‌లో శనివారం హౌస్ ఎన్నికలను ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించారు. కరస్పాండెంట్ వేణుమాధవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎన్నికల్లో సీవీ రామన్, ఆర్యభట్ట, రామానుజన్, చాణక్య హౌస్‌లకు చెందిన విద్యార్థులు బ్యాలెట్ బాక్స్‌లో ఓటు వేసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ప్రతి హౌస్‌కు చెందిన సుమారు 45 మంది విద్యార్థులు ఎన్నికల్లో పాల్గొని ప్రజాస్వామ్య ప్రక్రియను ప్రత్యక్షంగా అనుభవించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ వేణుమాధవ్ మాట్లాడుతూ, విద్యార్థులకు ఓటు హక్కు ప్రాధాన్యం, ఎన్నికల విధానం, ప్రజాస్వామ్య విలువలపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. చిన్నప్పIMG-20260718-WA0039టి నుంచే ప్రజాస్వామ్య స్ఫూర్తి, బాధ్యతాయుతమైన పౌరసత్వ భావన పెంపొందేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని అన్నారు.
కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ముంజాల సంగీత, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఓటు విలువను నేర్పిన శస్త్ర పబ్లిక్ స్కూల్. ఓటు విలువను నేర్పిన శస్త్ర పబ్లిక్ స్కూల్.
హుజూరాబాద్, జూలై 18(తెలంగాణ ముచ్చట్లు ): హుజూరాబాద్ పట్టణంలోని శస్త్ర పబ్లిక్ స్కూల్‌లో శనివారం హౌస్ ఎన్నికలను ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించారు. కరస్పాండెంట్ వేణుమాధవ్ ఆధ్వర్యంలో జరిగిన...
సీడ్ ప్లాంట్ల అక్రమాలకు అడ్డుకట్ట వేయాలి.
తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు కోసం స్థల పరిశీలన చేసిన కలెక్టర్.
వాన కోసం భక్తి జలధార.. రంగమ్మపెల్లిలో 200 మంది మహిళల నీరాభిషేకాలు.
ప్రజల భద్రతే లక్ష్యం.. విలాసాగర్‌లో ఏడు సీసీ కెమెరాల ఆవిష్కరణ.
మృతుడి కుటుంబానికి బీఆర్ఎస్ నేత కొట్టుకూరి శ్రీనివాస్ రెడ్డి ఆర్థిక సహాయం.
విద్యార్థుల సంక్షేమంపై డిప్యూటీ డైరెక్టర్ ప్రత్యేక దృష్టి.