జమ్మికుంటలో బీఆర్‌ఏఓయూ డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం.
జమ్మికుంట టౌన్ జూలై 04 (తెలంగాణ ముచ్చట్లు):
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ & పీజీ కళాశాలలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (బీఆర్‌ఏఓయూ) స్టడీ సెంటర్ ద్వారా 2026–27 విద్యా సంవత్సరానికి డిగ్రీ దూరవిద్య ప్రవేశాల నోటిఫికేషన్ విడుదలైనట్లు కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ ఎస్.ఓ. కుమార్, కోఆర్డినేటర్ డాక్టర్ కే. రాజేంద్రం తెలిపారు.
బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో చేరాలనుకునే అర్హులైన విద్యార్థులు ఆగస్టు 7, 2026లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కొత్తగా ప్రవేశాలు పొందే విద్యార్థులతో పాటు ప్రస్తుతం ద్వితీయ, తృతీయ సంవత్సరాలు అభ్యసిస్తున్న విద్యార్థులు కూడా నిర్ణీత గడువులోగా తమ వార్షిక ట్యూషన్ ఫీజును చెల్లించాలని తెలిపారు.
గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఉద్యోగం లేదా ఇతర బాధ్యతలతో పాటు ఉన్నత విద్యను కొనసాగించేందుకు దూరవిద్య చక్కటి అవకాశమని పేర్కొన్నారు. ప్రవేశాలు, ఫీజులు మరియు ఇతర వివరాల కోసం 73829 29775 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని తమ ఉన్నత విద్య లక్ష్యాలను సాధించాలని వారు కోరారు.


Comments