ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో దొడగుంటపల్లి నాయకులు.

ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో దొడగుంటపల్లి నాయకులు.

పెద్దమందడి,జూన్30(తెలంగాణ ముచ్చట్లు):

పెద్దమందడి మండలం దొడగుంటపల్లి గ్రామంలో నిర్వహించిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో గ్రామ నాయకులు పాల్గొన్నారు.ఓటరు జాబితాలో కొత్త పేర్ల నమోదు, మార్పులు, చిరునామా సవరణలు, తొలగింపుల ప్రక్రియను పరిశీలించి, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో తప్పనిసరిగా నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని బి ఎల్ ఓ లను కోరారు.ఈ సందర్భంగా నాయకులు గ్రామ ప్రజలకు ఓటరు నమోదు, సవరణల ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. 18 సంవత్సరాలు నిండిన యువతతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు.ప్రజలు తమ వివరాలను పరిశీలించి అవసరమైన మార్పులు, చేర్పులు నిర్ణీత గడువులోగా చేయించుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎన్నికల సిబ్బంది, బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌వోలు), గ్రామ నాయకులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బిఎల్వోలు సువర్ణ, జ్యోతి, స్థానిక సర్పంచ్ కొమ్ము పెంటయ్య, జానకి రాములు,శ్రీనివాస్ రెడ్డి.,సుదర్శన్.,నిరంజన్, శివారెడ్డి ,పి రాములు,మాజీ ఎంపిటిసి బాలప్ప, ఆటో మల్లయ్య.మరియు బొక్కలయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .