పామిరెడ్డిపల్లిలో ఎస్‌ఐఆర్–2026 నమోదు ప్రక్రియ ప్రారంభం.

పామిరెడ్డిపల్లిలో ఎస్‌ఐఆర్–2026 నమోదు ప్రక్రియ ప్రారంభం.

పెద్దమందడి,జూన్25(తెలంగాణ ముచ్చట్లు):

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ ఐ ఆర్)–2026 కార్యక్రమం పెద్దమందడి మండలం  పామిరెడ్డిపల్లి గ్రామంలో గురువారం ప్రారంభమైంది.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం పాల్గొని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఎస్‌ఐఆర్ ప్రక్రియ ద్వారా ఓటర్ల వివరాల నమోదు పారదర్శకంగా, కచ్చితత్వంతో నిర్వహించబడుతుందని తెలిపారు. గ్రామంలోని అర్హులైన ప్రతి ఓటరు తమ వివరాలను స్థానిక బూత్ లెవల్ అధికారులకు (బీఎల్ఓలు) సక్రమంగా అందించాలని సూచించారు.భవిష్యత్తులో ఓటరు జాబితాకు సంబంధించిన ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ఈ ప్రక్రియ ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. ప్రజలందరూ అధికారులకు పూర్తి స్థాయిలో సహకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ఇంద్రా లక్ష్మారెడ్డి, మాజీ సర్పంచులు సిద్దయ్య, తిక్కన్న, వార్డు సభ్యులు కృష్ణ, నరేష్, భాస్కర్, కొంకలి నరసింహ, మండల ఆర్‌ఐ శంకర్, జీపీఓ నాగరాజు, పంచాయతీ కార్యదర్శి స్రవంతి, బీఎల్ఓలు సునీత, లక్ష్మి, భాగ్యమ్మ, శారద తదితరులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .