శాలపల్లి గ్రామంలో ప్రైవేట్ పాఠశాల బస్సుల ప్రవేశానికి నిషేధం.
వేలేరు, జూన్ 14 (తెలంగాణ ముచ్చట్లు):
వేలేరు మండలంలోని శాలపల్లి గ్రామంలోకి ప్రైవేట్ పాఠశాలల బస్సుల ప్రవేశాన్ని నిషేధిస్తూ గ్రామసభలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. గ్రామ అభివృద్ధి, ప్రభుత్వ పాఠశాలల బలోపేతం మరియు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామ సర్పంచ్ కూరపాటి అశోక్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామంలోని తల్లిదండ్రులు గ్రామసభ తీర్మానాన్ని గౌరవించి సహకరించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని, విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి అందరూ కలిసి కృషి చేయాలని సూచించారు. నేటి బాలలను రేపటి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యతలో ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయ సహకారాలు అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.గ్రామ సర్పంచ్ కూరపాటి అశోక్ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరుగుతూ తల్లితండ్రుల కు ప్రభుత్వ విద్యా విధానం పైన అవగాహన కల్పించి,12 మంది పిల్లలను అడ్మిషన్ చేయించారు.ఈ కార్యక్రమంలో ఎం ఇ ఓ మొగిలిచర్ల చంద్రమౌళి ,పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు వాణి,ఉపాధ్యాయురాలు శారద, లక్ష్మి తండా ప్రధానోపాధ్యాయులు రాజు,అంగన్వాడీ టీచర్ సరస్వతి ,గ్రామ పాలక వర్గ సభ్యులు,ఉపసర్పంచ్ ఎర్రగోల్ల రమేష్ ,దేవరాజుల వెంకటేష్,మలోత్ జయంత్, మహిళా సమైక్య సంఘం అధ్యక్షులు లావణ్య, సీ ఏ స్వరూప,కార్యదర్శి కన్నేబోయిన స్వరూప, గ్రామ పెద్దలు విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


Comments