జాతీయ స్థాయిలో 356వ ర్యాంకు సాధించిన గురుకుల విద్యార్థి.

జాతీయ స్థాయిలో 356వ ర్యాంకు సాధించిన గురుకుల విద్యార్థి.

పెద్దమందడి,జూన్13(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం గిరిజన సంక్షేమ గురుకుల విద్యార్థి ఇస్లావత్ యశ్వంత్ ఐఐటీ జేఈఈ మెయిన్స్‌లో దేశవ్యాప్తంగా 356వ ర్యాంకు సాధించాడు.బల్మూరు మండలం అంబగిరి గ్రామానికి చెందిన ఇస్లావత్ సక్రు, ఉమా దంపతుల కుమారుడైన యశ్వంత్ ఈ ఘనత సాధించడం పట్ల కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.గిరిజన సంక్షేమ గురుకుల కళాశాల ప్రధానాచార్యులు అబ్దుల్ ఖాదర్ జైలాని మాట్లాడుతూ.. యశ్వంత్ విజయం గురుకుల విద్యా వ్యవస్థ ప్రతిభకు నిదర్శనమని అన్నారు.ప్రభుత్వ గురుకుల విద్యాలయాల విద్యార్థులు కూడా జాతీయ స్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించగలరని పేర్కొన్నారు.జాతీయ స్థాయిలో వేలాది మంది విద్యార్థులు పోటీపడిన ఈ పరీక్షలో 356వ ర్యాంకు సాధించడం విశేషమని విద్యావేత్తలు అభిప్రాయపడ్డారు. కృషి, పట్టుదల, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం, తల్లిదండ్రుల ప్రోత్సాహమే తన విజయానికి కారణమని యశ్వంత్ తెలిపాడు. ఈ సందర్భంగా అధ్యాపకులు, సిబ్బంది విద్యార్థిని అభినందించి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .