కోరపల్లిలో సర్పంచ్ ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమం.

కోరపల్లిలో సర్పంచ్ ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమం.

జమ్మికుంట టౌన్ జూన్ 12 (తెలంగాణ ముచ్చట్లు):

జమ్మికుంట మండలంలోని కోరపల్లి గ్రామంలో శుక్రవారం జెడ్పీహెచ్ఎస్ పాఠశాల ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ కె. మధుసూదన్ నేతృత్వంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికీ వెళ్లి విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని అవగాహన కల్పించారు.

సర్పంచ్ మధుసూదన్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంక్షేమం కోసం నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం, గుడ్లు, రాగిజావ, ఉచిత పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు అందజేస్తున్నట్లు తెలిపారు.

పాఠశాల ప్రధానోపాధ్యాయులు కేతిరి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఆధునిక విద్యా సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. ముఖ్యంగా బాలికలకు కరాటే శిక్షణ, కంప్యూటర్ విద్య, సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన బోధనను అందిస్తున్నామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పి. రాజయ్య, పెండెం శ్రీనివాస్, కుమారస్వామి, విజేందర్ రెడ్డి, క్రాఫ్ట్ ఉపాధ్యాయుడు శ్రీమాన్, సీఆర్‌పీ గుర్రప్ప తదితరులు పాల్గొన్నారు. బడిబాట కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రుల్లో అవగాహన పెంపొందించేందుకు కృషి చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .