ప్రయాణికుడి వెండి నగలు భద్రంగా తిరిగి అప్పగింత!

సత్తుపల్లి డిపో కండక్టర్ మారేశ్వరరావుపై ప్రయాణికుడి ప్రశంసలు.

ప్రయాణికుడి వెండి నగలు భద్రంగా తిరిగి అప్పగింత!

సత్తుపల్లి, జూన్ 9 (తెలంగాణ ముచ్చట్లు): 

ప్రయాణికుడు బస్సులో మరిచిపోయిన సుమారు 50 తులాల వెండి నగలు ఉన్న బ్యాగును యథావిధిగా తిరిగి అప్పగించి సత్తుపల్లి డిపో కండక్టర్ నల్లగట్ల మారేశ్వరరావు తన నిజాయితీని చాటుకున్నారు. మంగళవారం సత్తుపల్లి నుంచి ఖమ్మం వెళ్తున్న టీఎస్ 04 యూడీ 1107 బస్సులో కొండేటి అజయ్ కుమార్ ప్రయాణించారు. ఖమ్మం కొత్త బస్టాండ్‌లో దిగిన అనంతరం తన వద్ద ఉన్న వెండి నగల బ్యాగును బస్సులోనే మరిచిపోయిన విషయం గుర్తించారు. వెంటనే ఖమ్మం కంట్రోల్ పాయింట్‌లో ఉన్న సత్తుపల్లి డిపో సిబ్బంది వేణును సంప్రదించగా, సమాచారం కండక్టర్ మారేశ్వరరావుకు చేరింది. అప్పటికే బస్సులో లభించిన బ్యాగును భద్రంగా తన వద్ద ఉంచుకున్న మారేశ్వరరావు, అది తన వద్ద ఉన్నట్లు ప్రయాణికుడికి సమాచారం అందించారు. అనంతరం సత్తుపల్లికి చెందిన అజయ్ కుమార్ తల్లి రమాదేవి సంబంధిత ఆధారాలను చూపించడంతో, సెక్యూరిటీ కానిస్టేబుల్ సలీం, చార్ట్ కంట్రోలర్ చిన్నపరెడ్డి సమక్షంలో బ్యాగుతో పాటు అందులోని వెండి నగలను ఆమెకు అప్పగించారు. తాను మరిచిపోయిన బ్యాగు, అందులోని విలువైన వస్తువులు తిరిగి దొరుకుతాయని అనుకోలేదని అజయ్ కుమార్ తెలిపారు. కండక్టర్ మారేశ్వరరావు చూపిన నిజాయితీకి కృతజ్ఞతలు తెలుపుతూ, ఆర్టీసీ యాజమాన్యంతో పాటు సత్తుపల్లి డిపో మేనేజర్ గురిజాల లక్ష్మీనారాయణకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News