వెల్టూర్ పాఠశాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహకాలు
పెద్దమందడి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పెద్దమందడి మండలం వెల్టూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించారు. గత విద్యా సంవత్సరంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన కుమారి, కావేరి,గాయత్రిలను అభినందించి నగదు ప్రోత్సాహకాలు అందజేశారు.ప్రతిభ కనబరిచిన ఒక్కో విద్యార్థికి 1991–1992 పదో తరగతి పూర్వ విద్యార్థుల తరఫున రూ.8,000/- గ్రామ సర్పంచ్ అశోక్ తరఫున రూ.10,000/- పాఠశాల యాజమాన్యం తరఫున ప్రధానోపాధ్యాయులు బాణం విష్ణు ఆధ్వర్యంలో రూ.10,000/- చొప్పున నగదు ప్రోత్సాహకాలను అందించారు.అలాగే జాతీయ ప్రతిభా అన్వేషణ పథకానికి ఎంపికైన ముగ్గురు విద్యార్థులను బహుమతులతో సత్కరించారు. రాబోయే విద్యా సంవత్సరంలో అత్యధిక మార్కులు సాధించే విద్యార్థులకు కూడా నగదు ప్రోత్సాహకాలు అందిస్తామని ప్రకటించారు.కార్యక్రమానికి సర్పంచ్ అశోక్, గ్రామ ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, మండల పరిషత్ మరియు జిల్లా పరిషత్ ప్రతినిధులు, మాజీ సర్పంచ్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, తల్లిదండ్రులు, యువకులు, గ్రామ పెద్దలు, అధికారులు తదితరులు హాజరయ్యారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించి అభినందించారు.విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించేందుకు సహకరించిన పూర్వ విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, పాఠశాల యాజమాన్యానికి ప్రధానోపాధ్యాయులు బాణం విష్ణు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు గుడిబండ శ్రీనివాస్ రెడ్డి, మద్దూర్ ఆంజనేయులు, శాంతయ్య, బండారు నరసింహ, రఘువర్ధన్ రెడ్డి, నక్కల భాస్కర్, రుక్మద్దీన్, సత్య శీలా రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


Comments