పెద్దమందడిలో రెపరెపలాడిన మువ్వన్నెల జెండా.
ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల్లో స్వాతంత్ర్య వేడుకల సందడి.

పెద్దమందడి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్దమందడి మండల కేంద్రంలో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ మల్లికార్జున్, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో పరిణత, పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐ జలంధర్ రెడ్డి, సింగిల్ విండో కార్యాలయంలో చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి జెండాను ఎగురవేశారు.అదేవిధంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ సూర్య గంగా జెండాను ఆవిష్కరించి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. మండలంలోని వివిధ అంగన్‌వాడీ కేంద్రాల్లోనూ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించి స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకున్నారు.ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ పాఠశాలలోనూ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ సిబ్బంది, విద్యార్థులు పాల్గొని జెండాకు గౌరవ వందనం సమర్పించారు.స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ ఐక్యత, సమగ్రతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. విద్యాసంస్థల్లో విద్యార్థులు దేశభక్తిని చాటే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.


Comments