దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.

టాప్రా, మెడికల్, ఆర్‌ఎంపీ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా జెండా పండుగ.

దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.

హుజురాబాద్,ఆగష్టు 15(తెలంగాణ ముచ్చట్లు ):

దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో ఏనాబైయవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ (టాప్రా) హుజురాబాద్ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని సైదాపూర్ రోడ్డులో గల మమతా వైన్డింగ్ వర్క్స్ ఆవరణలో వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి టాప్రా కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్ ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
టాప్రా హుజురాబాద్ యూనిట్ అధ్యక్షుడు భారత ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో చందుపట్ల జనార్ధన్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ప్రతి భారతీయుడు నిత్యం స్మరించుకోవాలని అన్నారు. వారి ఆశయాల బాటలో నడుస్తూ దేశానికి ఉపయోగపడే ఆదర్శ పౌరులుగా ఎదగాలని సూచించారు.
ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా సాధించుకున్న స్వాతంత్ర్యం, సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడం ప్రతి భారతీయుడి బాధ్యత అన్నారు. దేశ రక్షణ విషయంలో ప్రతి ఒక్కరూ సైనికుడిలా ఆలోచించి, దేశం కోసం అవసరమైన ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా నిర్వహించిన టాప్రా హుజురాబాద్ శాఖ ప్రతినిధులను అభినందించారు.
కార్యక్రమంలో టాప్రా హుజురాబాద్ శాఖ ప్రధాన కార్యదర్శి చీకట్ల సమ్మయ్య, కోశాధికారి మండల వీరాస్వామి, దాసరి మల్లేశం, దొంత హరికిషన్, గౌరీశెట్టి సాంబయ్య, ఉయ్యాల రాజేశం, బొంగోని వెంకటయ్య, మేకల మొగిలయ్య, చొల్లేటి మల్లారెడ్డి, చాడ సమీర్ రెడ్డి, శబ్ద ప్రకాష్, గాజర్ల బుచ్చిరాజం, గూడూరి స్వామిరెడ్డి, గాజే గంగయ్య, ఫారెస్ట్ అధికారి రవీందర్ రెడ్డి, తౌటం సంపత్ కుమార్, నల్ల రాజిరెడ్డి, ముక్కెర మొగిలి, గాజుల సత్యనారాయణ, కొత్తగట్టు రవీందర్ రెడ్డి, సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.
అదేవిధంగా హుజురాబాద్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు కర్ర పాపిరెడ్డి, సంగెం శ్రీనివాస్, చింతకుంట్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో పలువురు మెడికల్ షాప్ యజమానులు స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్నారు. ఆర్‌ఎంపీ అసోసియేషన్ అధ్యక్షులు కందకట్ల శ్రీనివాస్, చిలుకమారి శ్రీనివాస్ ఆధ్వర్యంలోనూ జెండా పండుగను ఘనంగా నిర్వహించారు.
హుజురాబాద్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన ఆర్‌ఎంపీలు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ పతాకానికి వందనం చేశారు. దేశభక్తి నినాదాలు చేస్తూ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. IMG-20260815-WA0101టాప్రా, మెడికల్, ఆర్‌ఎంపీ సంఘాల ప్రతినిధులు, సభ్యులు, పలువురు నాయకులు పాల్గొనడంతో కార్యక్రమం ఉత్సాహంగా సాగింది.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .