108, 102 ఉద్యోగులకు ఉత్తమ సేవ పురస్కారాలు.

108, 102 ఉద్యోగులకు ఉత్తమ సేవ పురస్కారాలు.

హనుమకొండ, ఆగస్టు 15 (తెలంగాణ ముచ్చట్లు): 

హనుమకొండ జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో 108, 102 అత్యవసర సేవల్లో ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ఉత్తమ సేవ పురస్కారాలు అందజేశారు.
ధర్మసాగర్ మండలం నుంచి 108 అత్యవసర వైద్య సేవల్లో ఉత్తమ సేవలు అందించిన అత్యవసర వైద్య సాంకేతిక నిపుణుడు మంకిడి నాగేశ్వరరావును, 102 గర్భిణీ స్త్రీలకు అత్యుత్తమ సేవలు అందించిన కెప్టెన్ మాచర్ల వెంకటేష్‌ను హనుమకొండ జిల్లా కలెక్టర్ ఎంపిక చేశారు.

ఎంపికైన ఉద్యోగులకు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా ఉత్తమ సేవ పురస్కారాలను అందజేశారు.
ఈ సందర్భంగా 108 ప్రోగ్రాం మేనేజర్ పాటి శివకుమార్, హనుమకొండ జిల్లా నిమేనేజర్  మండ శ్రీనివాస్ ఉద్యోగులను అభినందించారు. కార్యక్రమంలో 108, 102 సేవల సిబ్బంది పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .