దేశ ఐక్యత, సమగ్రతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి.

వెల్టూర్ పాస్టర్ సురేష్ కుమార్.

దేశ ఐక్యత, సమగ్రతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి.

పెద్దమందడి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):

దేశ అభివృద్ధి, ఐక్యత, సమగ్రత కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్ మన చర్చి పాస్టర్ సురేష్ కుమార్ పిలుపునిచ్చారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని పెద్దమందడి మండలం వెల్టూర్‌లోని న్యూ ఎస్సీ కాలనీలో గల మన చర్చి వద్ద శనివారం జాతీయ జెండాను ఎగరవేసి వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా సురేష్ కుమార్ మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ సేవకు ప్రతి ఒక్కరూ అంకితం కావాలని అన్నారు.యువత దేశ ప్రగతిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలో స్థానిక పాస్టర్, చర్చి సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు. అనంతరం అందరికీ 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .