కనపర్తిలో కాంగ్రెస్‌ బలోపేతానికి కొత్త కమిటీ.

అధ్యక్షుడిగా అల్లంరెడ్డి శ్రీనివాసరెడ్డి.

కనపర్తిలో కాంగ్రెస్‌ బలోపేతానికి కొత్త కమిటీ.

వీణవంక, ఆగస్టు 10 (తెలంగాణ ముచ్చట్లు):

 వీణవంక మండలం కనపర్తి గ్రామ కాంగ్రెస్‌ పార్టీ నూతన కమిటీ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. మెజార్టీ కార్యకర్తల అభిప్రాయం మేరకు పార్టీ నాయకత్వం నూతన కమిటీని ఎన్నుకుంది.
గ్రామ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా అల్లంరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఉపాధ్యక్షుడిగా పులి మదనయ్య, ప్రధాన కార్యదర్శిగా అనుమాండ్ల గోపాల్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
నూతన కమిటీ ఎన్నికతో గ్రామంలో పార్టీ కార్యకలాపాలను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని నాయకులు తెలిపారు. పార్టీపై విశ్వాసంతో ఏకగ్రీవ ఎన్నికకు సహకరించిన కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు, నాయకులకు నూతన కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేస్తూ కార్యకర్తలను సమన్వయం చేసుకుని ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వారు పేర్కొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

కేంద్ర విధానాలపై ప్రజా సంఘాల పోరుబాట. కేంద్ర విధానాలపై ప్రజా సంఘాల పోరుబాట.
జమ్మికుంట, టౌన్ ఆగస్టు 10 (తెలంగాణ ముచ్చట్లు): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీఐటీయూ, రైతు సంఘం, వ్యవసాయ...
కనపర్తిలో కాంగ్రెస్‌ బలోపేతానికి కొత్త కమిటీ.
అర్చకుల సంక్షేమానికి అంకితమైన నాయకత్వం.
ప్రతి పేద బిడ్డకు నాణ్యమైన విద్యే ధ్యేయం.
అనుమతుల్లేకుండా ఇసుక తరలింపు.. ఐదు ట్రాక్టర్లపై కేసులు.
సవాల్ విసిరితే బీఆర్‌ఎస్‌ నాయకులు ఎక్కడ?
రైతుకు నీళ్లు ఇస్తే స్వాగతిస్తాం.. ఇవ్వకపోతే ఉద్యమిస్తాం.