చంద్రపురికాలనీ డివిజన్ కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు.
పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన జిల్లా అధ్యక్షుడు వజ్రష్ యాదవ్ .
జవహర్ నగర్, ఆగస్టు 8 (తెలంగాణ ముచ్చట్లు):
ఇది ప్రజా ప్రభుత్వమని ప్రజా సంక్షేమం కోసమే పనిచేస్తుందని మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ అన్నారు. శనివారం చంద్రపురికాలనీ డివిజన్ అధ్యక్షుడు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో మాజీ ఎంపీటీసీ మొగిలిపాక పరశురాం, టీఆర్ఎస్వీ అధ్యక్షుడు నర్ర మహేష్, రాహుల్ కథమ్, బబ్లూ ముదిరాజ్ అనుచరులతోపాటు ఇతర నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ లో చేరారు. మొదటగా బాలాజీనగర్ నుండి బైక్ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం చంద్రపురికాలనీలోని కమ్యూనిటీ హాల్లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ జవహర్ నగర్ లో 210 కోట్లతో ఇంటిగ్రేటేడ్ పాఠశాల, సుమారు 50 కోట్లతో తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణ పనులు త్వరలో ప్రారంబం కానున్నాయన్నారు. జవహర్ నగర్, చంద్రపురికాలనీ అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడానికి ప్రణాళికలు రూపొందించామన్నారు. మరో రూ.5 కోట్లతో డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలిపారు. పాత ఇండ్లను కూల్చి నూతనంగా నిర్మించుకునే వారు మండల తాసిల్దార్ కు ధరఖాస్తు చేసుకుంటే ఎటువంటి ఇబ్బందులు రానివ్వమన్నారు. ఇప్పటికే 100 ఫీట్ల ప్రధాన రహదారి పనులు జరుగుతున్నాయని త్వరలో అంతర్గత రోడ్ల అభివృద్ధికి చర్యలు తీసుకోనున్నామన్నారు. ప్రతీ కాలనీలో మట్టిరోడ్డు లేకుండా చేయడమే తమ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో జవహర్ నగర్ డివిజన్ అధ్యక్షురాలు శాంతికోటేష్, మాజీ డిప్యూటీ మేయర్ శ్రీనివాస్, మాజీ సర్పంచ్ కారింగుల శంకర్ గౌడ్ , జిల్లా ప్రధాన కార్యదర్శి సదానంద్, రాష్ట్ర మహిళా కార్యదర్శి అనంతలక్ష్మి, ఏఎంసీ డైరెక్టర్ ఈగ స్వేతరాజు ముదిరాజ్, మాజీ కార్పోరేటర్లు వేణు, కుతాడి శ్రీకాంత్, సాయికుమార్, నాయకులు బల్లి శ్రీనివాస్, వినయ్, మిట్టూ యాదవ్, రజితగోపాల్, బూడిద వెంకటేష్, కారింగుల రాజుగౌడ్, చిట్టిబాబు, రమేష్ చారి తదితరులు పాల్గొన్నారు
.


Comments