ప్రభుత్వ పాఠశాలల సమస్యలపై సీపీఎం ఆందోళన.

మౌలిక వసతుల కల్పనకు డిమాండ్.

ప్రభుత్వ పాఠశాలల సమస్యలపై సీపీఎం ఆందోళన.

జమ్మికుంట టౌన్ ఆగస్టు 04 (తెలంగాణ ముచ్చట్లు):

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపడాలంటే నిర్వహణ నిధులు పెంచడంతో పాటు ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు కొప్పుల శంకర్ డిమాండ్ చేశారు. పార్టీ జిల్లా కమిటీ పిలుపు మేరకు జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలను సీపీఎం టౌన్ కార్యదర్శి దండి గారి సతీష్ ఆధ్వర్యంలో మంగళవారం సందర్శించారు.
ఈ సందర్భంగా కొప్పుల శంకర్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన ఉచిత విద్య అందించడం ద్వారా పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత విద్య అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. మరోవైపు ప్రైవేట్ విద్యాసంస్థలు అధిక ఫీజులతో తల్లిదండ్రులపై భారం మోపుతున్నాయని విమర్శిస్తూ, ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
పట్టణంలోని బాలికల పాఠశాలలో ఇంగ్లిష్, గణితం ఉపాధ్యాయుల కొరతతో బోధన దెబ్బతింటోందని, వర్షపు నీరు మైదానంలో నిల్వ ఉండడంతో విద్యార్థినులు క్రీడలకు దూరమవుతున్నారని తెలిపారు. అటెండర్ పోస్టు ఖాళీగా ఉండడం, బాలికల మరుగుదొడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉండడం, "మన ఊరు–మనబడి" కింద నిర్మించిన మరుగుదొడ్ల పనులు అసంపూర్తిగా నిలిచిపోవడం వంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు.
విద్యాసంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడిచినా విద్యార్థులకు యూనిఫాంలు అందలేదని, మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో నాణ్యమైన భోజనం అందించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెనూ చార్జీలు, వంట కార్మికుల వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు.
బాలుర ఉన్నత పాఠశాలలో అటెండర్, కంప్యూటర్ బోధకులు, నాన్-టీచింగ్ సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. పాఠశాలకు ఆడిటోరియం నిర్మించడంతో పాటు పాత భవనాల స్థానంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్, హాస్టల్ భవనాలను మంజూరు చేసి నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కమిటీ సభ్యులు వడ్లూరి కిషోర్, కన్నం సదానందం, గడ్డం శోభన్, తాటికంటి రంజిత్ కుమార్, తుర్పాటి నాగరాజు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.IMG-20260804-WA0011

Tags:

Post Your Comments

Comments

Latest News

శిశు సంపూర్ణ ఆరోగ్యానికి తల్లిపాలే అమృతం. శిశు సంపూర్ణ ఆరోగ్యానికి తల్లిపాలే అమృతం.
పెద్దమందడి,ఆగస్టు04(తెలంగాణ ముచ్చట్లు): పెద్దమందడి మండలం మంగంపల్లి అంగన్‌వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలను అంగన్‌వాడీ టీచర్ నారాయణమ్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ రమేష్ హాజరయ్యారు....
ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి.
బీజేపీకి భారీ ఎదురుదెబ్బ.. బీఆర్‌ఎస్ గూటికి ముగ్గురు సర్పంచ్‌లు.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరుబాటలో సీపీఐ
ప్రభుత్వ పాఠశాలల సమస్యలపై సీపీఎం ఆందోళన.
ఇంటి సరిహద్దు వివాదం ముగ్గురు అరెస్ట్.
పరిమళ కాలనీ వాసులకు ఉచిత వైద్య సేవలు.