శ్రీనన్న ఆత్మీయ భరోసా..ప్రతి పేద కుటుంబ నమ్మకానికి ప్రతిక.
* పిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 44 కుటుంబాలకు 10,000/ రూపాయల ఆర్థిక భరోసా
ఖమ్మం బ్యూరో, ఆగస్టు 3(తెలంగాణ ముచ్చట్లు )
కూసుమంచి మండలంలో నేలపట్ల, లోక్య తండా, గంగ బండ తండ, గట్టుసింగారం, మల్లెపల్లి, పెరక సింగారం, హిరమన్ తండ, నాయకన్ గూడెం, పాలేరు, సంధ్య తండ, గైగోలపల్లి, పోచారం, ముత్యాల గూడెం, కేశవపురం, తురకగూడెం,కూసుమంచి గ్రామాలలో వివిధ కారణాలతో మరణించిన 44 కుటుంబాలకు పి ఎస్ ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 10,000/ రూపాయల ఆర్థిక సహాయాన్ని కూసుమంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఇంచార్జ్ భీమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా అందజేయడం జరిగింది...ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ కుటుంబ పెద్ద ను కోల్పోయి కష్ట సమయంలో మమ్మల్ని ఒంటరిగా వదిలేయకుండా మా కుటుంబాలకు అండగా నిలిచిన మంత్రివర్యులు పొంగులేటి శ్రీనన్నకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూసుమంచి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బజ్జూరి వెంకటరెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మంకెన వాసు, జిల్లా నాయకులు జొన్నలగడ్డ రవి, మాజీ ఎంపీపీ జూకూరి గోపాల్ రావు కాంగ్రెస్ పార్టీ నాయకులు కంచర్ల జీవన్ రెడ్డి,మాజీ సర్పంచ్ చాట్ల పరుశురాం, కొర్ర రమేష్, కొత్త పుల్లారెడ్డి, సర్పంచ్ లు వడిత్య వెంకటేష్ నాయక్, బాదావత్ నరేష్, యువజన విభాగం శేఖర్ రెడ్డి, మహమ్మద్ రఫీ ఆయా గ్రామ సర్పంచులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొనడం జరిగింది.


Comments