వీణవంకలో 'సర్' ఫారాల డిజిటలైజేషన్ 99 శాతం పూర్తి.

వీణవంకలో 'సర్' ఫారాల డిజిటలైజేషన్ 99 శాతం పూర్తి.

* 55 పోలింగ్ కేంద్రాల్లో వేగంగా ప్రక్రియ.

*  కేవలం 767 ఫారాలు మాత్రమే పెండింగ్.

వీణవంక, ఆగస్టు 01 (తెలంగాణ ముచ్చట్లు):

కరీంనగర్ జిల్లా వీణవంక మండల వ్యాప్తంగా 'సర్' ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ 99 శాతం పూర్తయినట్లు తహశీల్దార్ ముద్దసాని రమేష్ తెలిపారు. మండలంలోని మొత్తం 55 పోలింగ్ కేంద్రాల పరిధిలో ఉన్న 43,260 మంది ఓటర్లలో ఇప్పటికే 38,565 మంది వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసినట్లు వెల్లడించారు.
మండలంలోని 18 పోలింగ్ కేంద్రాల్లో డిజిటలైజేషన్ ప్రక్రియ వంద శాతం పూర్తయిందని తెలిపారు. ప్రస్తుతం కేవలం 767 ఫారాలు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని కూడా త్వరితగతిన పూర్తి చేసేందుకు అధికారులు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
అలాగే 3,928 మంది ఓటర్లు వలస వెళ్లడం లేదా మరణించడం వంటి కారణాలతో వారి వివరాలను గుర్తించినట్లు తెలిపారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువులోపు డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తిచేసి, ఓటరు జాబితాను మరింత పారదర్శకంగా రూపొందించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు తహశీల్దార్ వివరించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

*అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం. *అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం.
* ఆగస్టు 15 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు.. ఇంటర్ అర్హత కలిగిన స్థానిక మహిళలకు అవకాశం జమ్మికుంట టౌన్ ఆగస్టు 01 (తెలంగాణ ముచ్చట్లు):...
అర్హులైన ప్రతి ఓటరే లక్ష్యం.. క్షేత్రస్థాయిలో విస్తృత పరిశీలన.
వీణవంకలో 'సర్' ఫారాల డిజిటలైజేషన్ 99 శాతం పూర్తి.
దుర్గమ్మ, పోచమ్మ ఆలయాల్లో మినీ వాటర్ ట్యాంకుల నిర్మాణానికి శంకుస్థాపన.
సత్తుపల్లిలోనే వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేయాలి.
ఫీల్డ్ అసిస్టెంట్లకు నిరసన కార్యక్రమాలతో సంబంధం లేదు.
వెల్టూర్ గ్రామంలో సర్పంచ్ అశోక్, వార్డు సభ్యుల క్షేత్రస్థాయి పర్యటన.