శ్రీ మడేలేశ్వరస్వామి బోనాలకు ఘన శ్రీకారం.

శ్రీ మడేలేశ్వరస్వామి బోనాలకు ఘన శ్రీకారం.

* ప్రారంభోత్సవంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్

* ఆలయ అభివృద్ధికి సహకారం అందిస్తానని హామీ

జమ్మికుంట, జూలై 31 (తెలంగాణ ముచ్చట్లు):

జమ్మికుంట పట్టణంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైన శ్రీ మడేలేశ్వరస్వామి వారి బోనాల మహోత్సవంలో మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శ్రీ మడేలేశ్వరస్వామి వారి అనుగ్రహంతో పట్టణ ప్రజలందరూ పాడిపంటలు సమృద్ధిగా పండించి, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షించారు.
దేవాలయంలో ఇంకా కొన్ని మరమ్మతు పనులు పెండింగ్‌లో ఉన్నాయని రజక సంఘం ప్రతినిధులు తన దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. ఆలయ అభివృద్ధికి అవసరమైన మేరకు తనవంతు సహాయ సహకారాలు అందించి, మరమ్మతు పనులు పూర్తయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో రజక సంఘం అధ్యక్షుడు వరంగంటి సదానందం, బూరుగుపల్లి రాము, సంఘం నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జమ్మికుంట అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్.. 38 కీలక తీర్మానాలకు కౌన్సిల్ ఏకగ్రీవ ఆమోదం. జమ్మికుంట అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్.. 38 కీలక తీర్మానాలకు కౌన్సిల్ ఏకగ్రీవ ఆమోదం.
* డ్రైనేజీలు, రోడ్లు, తాగునీరు, వీధిదీపాలు, వినాయక నిమజ్జన ఏర్పాట్లకు గ్రీన్ సిగ్నల్ జమ్మికుంట, జూలై 31 (తెలంగాణ ముచ్చట్లు): జమ్మికుంట మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన...
77 వారాలుగా నిరంతర అన్నప్రసాద సేవ.
తరాలను తీర్చిదిద్దిన గురువుకు ఘన వందనం.
శ్రీ మడేలేశ్వరస్వామి బోనాలకు ఘన శ్రీకారం.
గ్రామీణుల ఆరోగ్యానికి బాలవికాస చేయూత.
ఐదవ వార్డులో విస్తృతంగా మొక్కల పంపిణీ.
మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి.