తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు కోసం స్థల పరిశీలన చేసిన కలెక్టర్.

తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు కోసం స్థల పరిశీలన చేసిన కలెక్టర్.

పెద్దమందడి,జులై17(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో  తెలంగాణ పబ్లిక్ స్కూల్ (టీపీఎస్) ఏర్పాటు ప్రతిపాదనలో భాగంగా జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి శుక్రవారం స్థలాన్ని పరిశీలించారు. పాఠశాల ఆవరణలో టీపీఎస్ ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, అందుబాటులో ఉన్న స్థలం, నిర్మాణానికి అనుకూల పరిస్థితులను పరిశీలించారు.అనంతరం ఇంజినీరింగ్ అధికారులతో కలిసి నిర్మాణానికి అవసరమైన వ్యయ అంచనాలపై సమీక్ష నిర్వహించారు. టీపీఎస్ ఏర్పాటుకు సంబంధించిన ఎస్టిమేషన్‌ను సమగ్రంగా రూపొందించి త్వరగా సమర్పించాలని ఇంజినీరింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.ఈ సందర్భంగా అక్కడే ఉన్న స్థానికులు పాఠశాల స్థలాన్ని పూర్తిస్థాయిలో సర్వే చేసి, హద్దులను గుర్తించిన తర్వాతే నిర్మాణ పనులు ప్రారంభించాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు.స్థలాన్ని సక్రమంగా వినియోగించేలా నిర్మాణం చేపడితే విద్యార్థులు క్రీడలు, ఇతర కార్యక్రమాల కోసం విశాలమైన మైదానం అందుబాటులో ఉంటుందని తెలిపారు.దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ పరిశీలనలో జడ్పీ సీఈఓ యాదయ్య, ఈడబ్ల్యూఐడీసీ ఇంజినీరింగ్ విభాగం అధికారులు, ఇతర శాఖల అధికారులు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రఘు ప్రసాద్,గ్రామ పంచాయతీ కార్యదర్శి వెంకటస్వామి,సర్పంచ్ అశోక్, గ్రామ నాయకులు బాబు రెడ్డి, దిండు రవీందర్,ప్రేమ్ సాగర్, వడ్డే శేఖర్, డి ఎస్ మహేష్, మద్దుర్ వెంకటయ్య, దయ్యాల దాసు, పెద్ద శ్రీనివాస్ రెడ్డి, నాగభూషణ్, నాగార్జున్, గ్రామస్తులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు కోసం స్థల పరిశీలన చేసిన కలెక్టర్. తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు కోసం స్థల పరిశీలన చేసిన కలెక్టర్.
పెద్దమందడి,జులై17(తెలంగాణ ముచ్చట్లు): వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో  తెలంగాణ పబ్లిక్ స్కూల్ (టీపీఎస్) ఏర్పాటు ప్రతిపాదనలో భాగంగా జిల్లా...
వాన కోసం భక్తి జలధార.. రంగమ్మపెల్లిలో 200 మంది మహిళల నీరాభిషేకాలు.
ప్రజల భద్రతే లక్ష్యం.. విలాసాగర్‌లో ఏడు సీసీ కెమెరాల ఆవిష్కరణ.
మృతుడి కుటుంబానికి బీఆర్ఎస్ నేత కొట్టుకూరి శ్రీనివాస్ రెడ్డి ఆర్థిక సహాయం.
విద్యార్థుల సంక్షేమంపై డిప్యూటీ డైరెక్టర్ ప్రత్యేక దృష్టి.
సత్తుపల్లిలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం.
దమ్మపేటకు సబ్‌కోర్టు మంజూరు చేయాలి.